తాగు నీటికోసం భగ్గుమన్న ఇండోర్..48 గంటల్లో రెండు భారీ నిరసనలు

తాగు నీటికోసం భగ్గుమన్న ఇండోర్..48 గంటల్లో రెండు భారీ నిరసనలు

యూపీలోని ఇండోర్ లో నీటి కొరత ప్రజలు రోడ్డెక్కారు.  భారీ ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీశారు. 48 గంటల్లో రెండు భారీ నిరసనలకు దిగారు. అధికారులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మెట్రో నగరంలో ఏంటీ దుస్థితి అని నిలదీశారు.   క్లీన్ మెట్రోనగరం  ఇండోర్ కనీస తాగునీటిని అందించలేకపోయారని విమర్శించారు. నిప్పుల ఎండలో కూడా భారీ ర్యాలీల్లో ప్రజలు పాల్గొన్నారంటే  సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో  ఇండోర్ లో అన్ని ప్రాంతాల్లో నీళ్లు రాకస్థానిక ప్రజలు, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.  అయితే ఇదంతా ప్రతిక్షాల కుట్ర అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. 

మంగళవారం(మే 26) ఇండోర్ లో తీవ్రమైన నీటిఎద్దడిపై భారీ నిరసనలు చెలరేగాయి. నీటి సరఫరా లేకపోవడంతో క్లీన్ సిటీ గా పేరొందిన ఇండోర్ నగర వాసులు వీధుల్లోకి వచ్చారు.  మంగళ, బుధ వారాల్లో  వరసగా భారీ నిసరనలకు దిగారు. 42 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా నిరసనల్లో పాల్గొన్నారు.వీరికి స్థానిక  ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులుమద్దతు పలికారు. 

ఇండోర్ లో ట్యాంకర్ల దగ్గర బక్కెట్లతో నీటిని నింపుకునేందుకు కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీరు దొరక్క రోజువారీ పనులు చేసుకోలేక అటు పనులకు వెళ్లలేక సతమతమవుతున్న ఇండోర్ ప్రజలు ప్రభత్వం అధికారులుపై తిరగబడ్డారు. భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి  నిరసనలు తెలిపారు. ఈ ఆందోళనతో క్లీన్ మెట్రోనగరం  ఇండోర్ కనీస తాగునీటిని అందించలేకపోవడంపై అనేక ప్రశ్నలు , సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే  ఇండోర్ నిరసనలపై స్పందించిన పట్టణ మేయర్ స్పందిస్తూ..  ఇదంతా  ప్రతిపక్ష కాంగ్రెస్ కౌన్సిలర్ల నాటకం.. ఇండోర్ నిరసనలు చేస్తు్న్న ప్రజలు కూడా అదే నాటకం అడుతున్నారు. వారి వార్డుల్లో నీటి సరఫరా ఉన్నప్పటికీ .. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రోత్సాహంతో నిరసనలు చేరస్తున్నారని కొట్టిపారేశారు. 

ALSO READ : CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ

ఇటీవలి నిరసనలు..

రాజ్వాడ నిరసన: ఇండోర్‌లో నీటి కొరతకు నిరసనగా మంగళవారం రాజ్వాడలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నివాసితులు ఆందోళన చేపట్టారు. నిరంతర నీటి సరఫరా చేయాలని కోరారు.  మొత్తం 85 వార్డుల ప్రజలు ఈ నిరసనలో పాల్గొని, సరైన తాగునీటిని అందించడంలో బీజేపీ నేతృత్వంలోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని ఆరోపించారు. సక్రమంగా లేని నీటి సరఫరాపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఐఎంసి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, నినాదాలు చేస్తూ, ఖాళీ మట్టి కుండలను పగలగొట్టారు. 

పల్దా స్క్వేర్ నిరసన: ఆదివారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక నిరసనలు జరిగాయి. ఇండోర్‌లో కొనసాగుతున్న నీటి సంక్షోభానికి నిరసనగా కాంగ్రెస్ కౌన్సిలర్ కునాల్ సోలంకి నేతృత్వంలో 75, 64 వార్డుల నివాసితులతో కలిసి పల్దా స్క్వేర్ దగ్గర భారీ నిరసన తెలిపారు. 

ప్రజలకు నీటిని అందించడంలో ఐఎంసి విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు.ప్రదర్శనకారులను చెదరగొట్టడానికి వాటర్ కెనాన్ ట్యాంకులను ఉపయోగించారు.. పౌరులకు అందించడానికి ఐఎంసి వద్ద నీరు లేదని, అయితే నిరసనకారులను చెదరగొట్టడానికి 'డజన్ల కొద్దీ వాటర్ కెనాన్ ట్యాంకులు' సిద్ధంగా ఉన్నాయని ప్రశ్నించారు. 

మరోసారి భగీరథపురా సంఘటన తెరపైకి 

భగీరత్‌పురాలో ఐఎంసీ సరఫరా చేసిన కలుషిత నీటి కారణంగా 36 మంది మరణించారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఆరోపించారు. నీటి సంక్షోభం కారణంగా అనేక కుటుంబాలు నీటి ట్యాంకర్లపై అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నాయని, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు కూడా తెలిపారు.