రాష్ట్రంలో  49 శాతం ఎక్కువ వానలు

రాష్ట్రంలో  49 శాతం ఎక్కువ వానలు

ఐదేండ్లలో ఇదే రికార్డు

14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

నెలలో 20 రోజుల్లోనే 126% ఎక్కువగా నమోదు

ఇయ్యాల పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

 రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వానలు ఐదేండ్ల రికార్డులను తిరగ రాశాయి. సగటున 523 మి.మీ. వర్షపా తం అంచనా వేయగా.. 777.6 మి.మీ. రికార్డయిం ది. అంటే 49 శాతం వానలు ఎక్కువగా పడ్డాయి.14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 11 జిల్లాల్లో భారీ వర్షాలు, 8 జిల్లాల్లో నార్మల్ వర్షాలు కురిశాయి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వానలు ఐదేండ్ల రికార్డులను తిరగరాశాయి. సగటున 523 మి.మీ. వర్షపాతం అంచనా వేయగా.. 777.6 మి.మీ. రికార్డయింది. అంటే 49 శాతం వానలు ఎక్కువగా పడ్డాయి.14జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 11 జిల్లాల్లో భారీ వర్షాలు, 8 జిల్లాల్లో నార్మల్ వర్షాలు కురిశాయి. ముందస్తు గా అంచనా వేసిన రెయిన్ ఫాల్ కంటే 49 శాతం ఎక్కువగా రికార్డవడం ఐదేండ్లలో ఇదే మొదటిసారని వాతావరణ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది ఇదే టైంలో కురిసి న వానలతో పోలిస్తే ఇప్పుడు 60 శాతం ఎక్కువగా కురిశాయని చెప్పారు. ఇప్పటికే వనపర్తి జిల్లాలో 137 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో మణుగూరు

ఎగువన ఉన్న వాగులు పొంగిపొర్లు తున్నాయి. దీంతో టౌన్ మొత్తం

ఇలా నీట మునిగింది. రోడ్లన్నీ కాలువల్ని తలపించాయి.