వరంగల్ జిల్లా హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. నయీమ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో సర్జీత్ ప్రేమ్ అనే నాలుగో తరగతి విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు.
తల్లిదండ్రులకు తెలియకుండా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రికి వచ్చేలోపే బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని, తలనొప్పి కారణంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు వైద్యులు.
అయితే ఎటువంటి లక్షణాలు లేకుండా బ్రెయిన్ డెడ్ ఎలా అయ్యాడంటూ, పాఠశాల ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాఠశాల ముందు భారీగా మోహరించారు పోలీసులు.
