
డయాబెటిస్..ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య. డయాబెటిస్ మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు, నరాల దెబ్బతినడం, మూత్రపిండాల దెబ్బతినడం, కంటి చూపు దెబ్బతినడం ,పాదాల సమస్యలు ఇలా రకరకాల ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
కాబట్టి డయాబెటిస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా ముందుగానే నియంత్రించే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ అటాక్ అవుతుందంటే.. ఉదయం సమయాల్లో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు అంటున్నారు. అవేంటే చూద్దాం..
1 నిద్ర లేవగానే చాలామందికి అలస, బలహీనంగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటిక్ ఉండవచ్చు.. వెంటనే చెకప్ చేయించుకోవాలి.
2. ఉదయం లేవగానే లేదా ఉదయం వేళల్లో దృష్టి లోపాలు కూడా డయాబెటిస్ ను సూచిస్తాయి. కంటిచూపు మసకగా ఉన్నట్లయితే జాగ్రత్త పడాలి. రక్తంలో అధిక చక్కెరల కారణంగా దృష్టి తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
3. డయాబెటిస్ ఉన్నట్లయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత మూత్రం ముదురు పసుపు రంగులో ఉండటం లేదా తరచుగా మూత్ర విసర్జన చేయడం వంటి రక్తంలో చక్కెర స్థాయిల లక్షణాలు కనిపిస్తాయి.
4.ఉదయాన్నే అధిక దాహం వేయడం కూడా డయాబెటిస్ కు సంకేతం. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ఐక్యరాజ్యసమితి మధుమేహాన్ని(డయాబెటిస్) ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా గుర్తించింది.డయాబెటిస్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, చికిత్స మెరుగుపర్చడం ,జాతీయ మధుమేహ విధానాలను అభివృద్ధి చేయాలని ప్రపంచ దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘(WHO) కోరుతోంది.