Argentina vs Spain Final Clash: ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ పండగ ఫిఫా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. న్యూజెర్సీ వేదికగా ఈరోజు ( సోమవారం, జూలై 19) జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మెగా సమరంలో గెలిచిన జట్టు ముద్దాడే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు చూద్దాం.
* ప్యూర్ గోల్డ్‌తో తయారీ:
ఈ ఐకానిక్ వరల్డ్ కప్ ట్రోఫీ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, ఎత్తుకోవడానికి అంత బరువుగా ఉంటుంది. ఈ ట్రోఫీ మొత్తం బరువు 6.142 కిలోగ్రాములు (సుమారు 13.5 పౌండ్లు) ఉంటుంది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మొత్తం బరువులో ఏకంగా 5.092 కిలోగ్రాములు కేవలం ప్యూర్ గోల్డ్ (నిఖార్సయిన రంగు బంగారం) ఉండటం విశేషం.
* టోర్నమెంట్ తర్వాత మారే బాటమ్ డిస్క్:
ప్రతిసారి వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొత్త ఛాంపియన్‌గా నిలిచిన దేశం పేరును ట్రోఫీ కింద ఉండే ఒక ప్రత్యేకమైన డిస్క్‌పై రాస్తారు. అనంతరం, ఈ బాటమ్ డిస్క్‌ను తొలగించి జ్యూరిచ్‌లోని ఫిఫా మ్యూజియం కలెక్షన్లో భద్రపరుస్తారు. మళ్లీ కొత్త హిస్టరీ రాయడం కోసం ట్రోఫీ కింద సరికొత్త డిస్క్‌ను అమర్చుతారు.
* ఇది ఒరిజినల్ ట్రోఫీ కాదు:
ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గోల్డెన్ ట్రోఫీ 1974 నుంచి మాత్రమే వాడుకలో ఉంది. అంతకుముందు విజేతలకు జూల్స్ రిమెట్ ట్రోఫీ (Jules Rimet Trophy)ని అందించేవారు. అయితే 1970లో బ్రెజిల్ జట్టు మూడోసారి వరల్డ్ కప్ గెలవడంతో, అప్పటి రూల్స్ ప్రకారం ఆ ఒరిజినల్ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని బ్రెజిల్ దక్కించుకుంది. ఆ తర్వాతే ఈ సరికొత్త బంగారు ట్రోఫీని డిజైన్ చేశారు.
* ముట్టుకుంటే రూల్స్ బ్రేక్.. నో టచ్ రూల్స్:
ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఎవరు పడితే వారు తాకడానికి వీల్లేదు. దీనిపై ఫిఫా చాలా కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. కేవలం మూడు వర్గాల ప్రజలు మాత్రమే ఈ ట్రోఫీని నేరుగా చేతులతో తాకవచ్చు.1. ఫిఫా ప్రెసిడెంట్, 2. వరల్డ్ కప్ విజేతలు (ఆటగాళ్లు, కోచ్‌లు), 3. వివిధ దేశాల అధినేతలు (ప్రెసిడెంట్లు లేదా రాజులు). వీరు తప్ప మరెవరైనా ఈ ట్రోఫీని పట్టుకోవాలంటే ఖచ్చితంగా చేతులకు గ్లోవ్స్ (Gloves) ధరించాలనే రూల్ ఉంది.
ALSO READ : అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్..
* రియల్ ట్రోఫీని విజేతలు సొంతం చేసుకోలేరు:
ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కప్ కొట్టిన ఆనందంలో ఆటగాళ్లు ముద్దాడే ఆ ఒరిజినల్ సాలిడ్ గోల్డ్ ట్రోఫీ ఎప్పటికీ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఫిఫా మ్యూజియంలోనే భద్రంగా ఉంటుంది. గెలిచిన దేశాలు ఈ ఒరిజినల్ కప్‌ను తమ దేశానికి తీసుకెళ్లలేవు. దానికి బదులుగా, విజేతగా నిలిచిన జట్టుకు అసలు ట్రోఫీని పోలిన నకిలీ ట్రోఫీ (Replica) ని శాశ్వతంగా అందజేస్తారు.
Only the FIFA president, World Cup winners, and heads of state are allowed to touch the trophy without wearing gloves
— Mario Nawfal (@MarioNawfal) July 19, 2026
Writer: Ianpic.twitter.com/dlxVXXX91J
