స్పెయిన్ పై కాసుల వర్షం.. ఏకంగా రూ. 491 కోట్ల ప్రైజ్ మనీ!

 స్పెయిన్ పై కాసుల వర్షం.. ఏకంగా రూ. 491 కోట్ల ప్రైజ్ మనీ!

FIFA World Cup 2026: న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో బలమైన అర్జెంటీనాను 1–0 తేడాతో ఓడించి, చరిత్రలో రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పానిష్ జట్టు ముద్దాడింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. ఆ తర్వాత 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. దీంతో 2010 తర్వాత మళ్లీ స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ఈ మెగా టోర్నమెంట్ కోసం ఫిఫా ఏకంగా $871 మిలియన్ల (సుమారు రూ. 7,250 కోట్లు) భారీ ప్రైజ్ పూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇది 2022 ఖతార్ ప్రపంచకప్‌తో పోలిస్తే ఏకంగా 50 శాతం కంటే ఎక్కువ నిధుల పంపిణీ కావడం విశేషం. ప్రారంభంలో $727 మిలియన్లుగా ప్రకటించినప్పటికీ, మూడు దేశాల (అమెరికా, కెనడా, మెక్సికో) మధ్య ప్రయాణ, వసతి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ బడ్జెట్‌ను మరింత పెంచారు. ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టోర్నమెంట్ స్థానం                             ప్రైజ్ మనీ (USD లో)                     భారత కరెన్సీలో 
విజేత (Winners)                                      $51 మిలియన్లు                  ₹491 కోట్లు
రన్నరప్ (Runners-up)                            $34 మిలియన్లు                 ₹327.4 కోట్లు
3వ స్థానం (3rd Place)                              $30 మిలియన్లు                  ₹288.8 కోట్లు
4వ స్థానం (4th Place)                              $28 మిలియన్లు                  ₹269.6 కోట్లు
5వ - 8వ స్థానం (Quarterfinalists)           $20 మిలియన్లు                 ₹192.6 కోట్లు
9వ - 16వ స్థానం (Round of 16)              $16 మిలియన్లు                 ₹154.1 కోట్లు
17వ - 32వ స్థానం (Round of 32)            $12 మిలియన్లు                 ₹115.5 కోట్లు
33వ - 48వ స్థానం (Group Stage)            $10 మిలియన్లు                  ₹96.3 కోట్లు