స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి.. గ్రౌండ్లోనే కొట్టుకున్న ప్లేయర్స్!

స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి.. గ్రౌండ్లోనే కొట్టుకున్న ప్లేయర్స్!

FIFA World Cup Final Turns Ugly: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పెయిన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పారేడెస్ (Leandro Paredes) చేసిన ఒక పని ఇరు జట్ల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. పండగలా సాగాల్సిన విజయోత్సవాలు కాస్తా, ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మధ్య ఘర్షణతో రణరంగంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పారేడెస్ మొదటి పంచ్.. టచ్‌లైన్ వద్ద హైడ్రామా: 
మ్యాచ్ ముగిసినట్లు రెఫరీ ఫైనల్ విసిల్ ఊదిన వెంటనే పారేడెస్ తీవ్ర ఆగ్రహంతో స్పెయిన్ ఆటగాళ్ల వైపు దూసుకెళ్లాడు. తోటి ప్లేయర్స్, మ్యాచ్ అధికారులు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, టచ్‌లైన్ సమీపంలో ఇరు జట్ల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఈ తోపులాటలో పారేడెస్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ స్పెయిన్ యువ మిడ్‌ఫీల్డర్ గావి (Gavi) మెడను గట్టిగా పట్టుకోవడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో రెండు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకునే దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. మ్యాచ్ రెఫరీలు, ఇరు జట్ల సపోర్ట్ స్టాఫ్ చాలా కష్టపడి ఆటగాళ్లను విడదీయాల్సి వచ్చింది. 

ALSO READ :  స్పెయిన్ పై కాసుల వర్షం.. ఏకంగా రూ. 491 కోట్ల ప్రైజ్ మనీ!

పారేడెస్‌పై తీవ్ర విమర్శలు.. స్పెయిన్ సంబరాలు: 
ఓటమిని హుందాగా స్వీకరించకుండా, మైదానంలో సహనాన్ని కోల్పోయి హింసకు దిగిన పారేడెస్ ప్రవర్తనపై ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, విశ్లేషకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పెద్ద టోర్నమెంట్ ఫైనల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ఈ గొడవ కాసేపటికే సద్దుమణగడంతో.. స్పెయిన్ ప్లేయర్స్ ఆ చేదు జ్ఞాపకాన్ని పక్కన పెట్టి, 2026 ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి తమ చారిత్రాత్మక విజయోత్సవాల్లో మునిగిపోయారు.