
రేపటి (శుక్రవారం) నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. కరోనా సంక్షోభం వేళ జరుగుతున్న ఈ విశ్వ క్రీడలకు ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో మరో 5 క్రీడలకు స్థానం కల్పించారు. కరాటే, స్కేటింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్, బేస్ బాల్/సాఫ్ట్ బాల్ ఈవెంట్లు కూడా నిర్వహించనున్నారు. బాక్సింగ్, జూడో, తైక్వాండో వంటి ఆటలు ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో ఉండగా.. అదే కోవకు చెందిన కరాటేకు కూడా ఇప్పుడు స్థానం కల్పించారు. కరాటేలోని కుమిటే విభాగంలో 60 మంది, కటా విభాగంలో 20 మంది టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల కోసం పోటీ పడనున్నారు. స్కేటింగ్‌కు పలు యూరప్ దేశాల్లో చాంపియన్ షిప్‌లు కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ఈ క్రీడను కూడా ఒలింపిక్స్ లో చేర్చారు. 80 మంది పురుష, మహిళా క్రీడాకారులు పోటీ పడుతున్నారు.