OMG : ఐదు అంతస్తుల బిల్డింగ్.. నిలువునా కుప్ప కూలింది

OMG : ఐదు అంతస్తుల బిల్డింగ్.. నిలువునా కుప్ప కూలింది

ఐదు అంతస్తుల బిల్డింగ్.. వారం రోజుల క్రితం వరకు బాగానే ఉంది.. అందులో జనం బాగానే ఉన్నారు.. నిక్షేపంగా పదేళ్ల నుంచి ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు.. కాకపోతే ఒకే ఒక్క రోజులో ఆ బిల్డింగ్ తలరాత మారిపోయింది.. ఆ బిల్డింగ్ యజమాని జీవితం తలకిందులు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా పరిధిలో ఉన్న ఘండాల్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఘండాల్ ఏరియాలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలకు ఢీకొట్టాయి. ఈ క్రమంలోనే దానికి మరమ్మతులు చేశారు. వారం రోజులుగా బిల్డింగ్ లో కదలికలు రావటం మొదలయ్యాయి.. వెంటనే అప్రమత్తం అయిన బిల్డింగ్ యజమాని.. అందులో ఉన్న లా కాలేజీ స్టూడెంట్స్ ను ఖాళీ చేయించాడు. మరమ్మతులతో మళ్లీ బాగు చేయాలని చూశాడు. విషయాన్ని తెలుసుకుని పరిశీలించారు అధికారులు. బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఉపయోగం ఉండని స్పష్టం చేశారు. 

అధికారుల సూచనలు, మరమ్మత్తులు చేయటానికి వచ్చిన ఇంజినీర్లు ఇదే విషయం చెప్పటంతో.. ఆ బిల్డింగ్ ను అలాగే ఉంచేశాడు యజమాని. వాళ్లు చెప్పినట్లే.. జనవరి 20వ తేదీ ఉదయం.. ఐదు అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కోట్ల రూపాయలు ఖర్చుతో కట్టిన బిల్డింగ్.. కళ్ల ఎదుట కుప్పకూలుతుంటే ఆ యజమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం అంటే.. 2023 నవంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పట్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.. అలాంటి వాటిలో ఇది ఒకటి.. ఆ తర్వాత కొన్ని మరమ్మత్తులతో వినియోగంలోకి తెచ్చినా.. వారం క్రితం మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో అందులో ఉన్న వాళ్లకు ఖాళీ చేయించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. బిల్డింగ్ ఒక్కటే ఇప్పుడు అక్కడ లేదు.. నిన్నటి వరకు ఉంది.. ఇప్పుడు ఖాళీ స్థలం. అందుకే అంటారు ప్రకృతితో ఆటలు వద్దూ అని.. 

Also Read :  అంత దూరం వచ్చారా తల్లీ : మా మమ్మీని ఏలియన్స్ కిడ్నాప్ చేశారు..