బోర్డర్‌‌‌‌‌‌‌‌-గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో 5 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు

బోర్డర్‌‌‌‌‌‌‌‌-గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో 5 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు

న్యూఢిల్లీ : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి దీన్ని ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), బీసీసీఐ సోమవారం వెల్లడించాయి. 1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.

‘32 ఏళ్ల తర్వాత బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించబోతున్నాం. ఈ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తాం’ అని సీఏ పేర్కొంది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్‌‌‌‌‌‌‌‌, అడిలైడ్‌‌‌‌‌‌‌‌, బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌, మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌, సిడ్నీలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఇండియా–ఆసీస్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన గత నాలుగు సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియానే విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.