ఐదేళ్ల వయసులోనే బైక్‌పై 90 స్పీడ్‌తో రేస్

ఐదేళ్ల వయసులోనే బైక్‌పై 90 స్పీడ్‌తో రేస్

మోటార్ స్పోర్ట్స్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టఫ్ఫెస్ట్ అండ్ ఎక్స్ పెన్సీవ్ స్పోర్ట్స్. ఇలాంటి స్టోర్ట్స్ లో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాడు ఐదేళ్ల బుడ్డోడు. అది ప్లే స్టేషన్ లో ఆడే వీడియో గేమ్ లో కాదు. రియల్ బైక్ పై.. 80, 90 స్పీడ్ తో రేస్ ట్రాక్ లో దుమ్ములేపుతున్నాడు.  చిన్న స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్తున్న బుడ్డోడి పేరు ఓం అద్వైత్. అమీన్ పూర్ కి చెందిన రాహుల్, గౌరీల కుమారుడు. తండ్రి రాహుల్ స్వతహాగా బైకర్. దీంతో టైమ్ దొరికినప్పుడల్లా బైక్ పై దేశమంతా తిరుగొస్తుంటాడు. అలా ఓసారి అద్వైత్ ని ఏడాదిన్నర వయస్సున్నప్పుడు సరదాగా రేసింగ్ ట్రాక్ కి తీసుకెళ్లాడు. ఇక అప్పటినుంచి అద్వైత్ బైక్ పై ఇష్టం పెంచుకున్నాడంటున్నారు పేరెంట్స్. 

చిన్న చిన్న బైక్ బొమ్మల్ని, రిమోట్ బైక్స్, కార్లని కొనిచ్చినా... రియల్ బైక్ కావాలని, తాను కూడా రేసింగ్ చేస్తానని అద్వైత్ చెప్పడంతో..  రేసింగ్ కి సంబంధించిన చిన్నచిన్న విషయాలు చెప్తూ... ముంబై, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన డీలర్స్ తో మాట్లాడి ఒక బైక్ ని తెప్పించానంటున్నాడు అద్వైత్ తండ్రీ రాహుల్.  బైక్ పై ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే మోటార్ స్పోర్ట్స్ లో దూసుకెళ్తున్నాడు ఈ చిచ్చర పిడుగు. ట్రాక్ పై బైక్ రేసింగ్ చేస్తూ యంగ్ స్టర్స్ కే హడల్ పుట్టిస్తున్నాడు. మూడడుగుల ఎత్తుకూడా లేని ఈ బుడ్డోడు ట్రాక్ మీదకెళ్తే... 80, 90 స్పీడ్ కి తగ్గేదే లే అంటున్నాడు. 

 ఇక ఈ బైక్ చూడ్డానికి చిన్నగా ఉన్నా.. ఇది టు-స్ట్రోక్ పెట్రోల్ బైక్. గంటకి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇలాంటివి ఇండియాలో తయారు కావు. మెకానిక్స్ కూడా దొరకరు. అద్వైత్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఈ బైక్ ని.. తన హైట్ కి తగ్గట్లు మళ్లీ మోడిఫై చేయించారు. పిల్లల కోసం ప్రముఖ ఆటోమోటీవ్ సంస్థ కవాసకీ ప్రత్యేకంగా బైక్స్ లాంచ్ చేసినా అవి ఇండియాలో అందుబాటులో లేవు. వేరే దేశాల్లో 80 నుంచి 90 వేలకు లభించే ఈ బైక్... మనం తెచ్చుకోవాలంటే మూడు లక్షలకి పైనే పెట్టాల్సి వస్తోందంటున్నారు.

ఓం అద్వైత్ బైక్ ప్రాక్టీస్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే అనేక ఫీట్స్ సాధించాడు. త్వరలోనే వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ సైతం చేసేందుకు సిద్దమయ్యాడు. ఇంత చిన్న వయస్సులో ఈ ఫీట్స్ సాధించడం గర్వంగా ఉందంటున్నారు అద్వైత్ కుటుంబ సభ్యులు. మొదట్లో భయం వేసినా.. ట్రాక్ మీద అన్ని విధాలుగా సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం, అద్వైత్ వాళ్ల నాన్నే దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తుండటంతో ధైర్యంగా ఉందంటున్నారు.

ప్రస్తుతం భారత్ లో మోటార్ స్పోర్ట్స్ చేస్తున్న యంగెస్ట్ బైక్ రేసర్ మన సిటీకి చెందిన ఓం అద్వైత్  కావడం విశేషం. భారత్ లో ఇంత చిన్న వయస్సున్న వారెవరూ రేసింగ్ చేసిన చరిత్ర లేదు. నారయణ్ కార్తిక్ లాంటి వాళ్లు కూడా ఎనిమిదేళ్ల దాటాకే రేసింగ్ లోకి వచ్చారు. త్వరలోనే వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతున్న ఓం అద్వైత్... మలేషియాలో జరిగే అండర్-8 వరల్డ్ కప్ లక్ష్యం అంటున్నాడు. భవిష్యత్ లో భారత్ కు మోటోజీపీ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ అందించడమే టార్గెట్ గా పెట్టుకున్నామంటున్నారు పేరెంట్స్.