
సిద్దిపేట: మరో అవినీతి చేప ACBకి చిక్కింది. లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ ను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు ACB అధికారులు. గురువారం బాచుపల్లిలో రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ యాదగిరిని పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. యాదగిరి స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాక. ఆయన ఇంటిలో కూడా సోదాలు చేస్తున్నారు ACB అధికారులు.