
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ పోలీసు విభాగంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. 50 మంది సీఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త పోస్టింగ్‌లలో చేరి, ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని సీపీ పేర్కొన్నారు.