హిల్‌‌ఫోర్ట్‌‌ కు మహర్దశ.. మరమ్మతుకు నిధులు మంజూరు

హిల్‌‌ఫోర్ట్‌‌ కు మహర్దశ.. మరమ్మతుకు నిధులు మంజూరు
  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: చారిత్రక కట్టడమైన హిల్​ఫోర్ట్ ప్యాలెస్ రిపేర్‌‌ పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ తెలిపింది. హిల్‌‌ఫోర్ట్‌‌ శిథిలావస్థకు చేరుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సంరక్షించడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌ హెరిటేజ్‌‌ ట్రస్ట్‌‌కు చెందిన దీపక్‌‌కాంత్‌‌ గిర్‌‌ పిల్‌‌ దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డి కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్యాలెస్‌‌ రిపేరు పనులపై రిపోర్టు ఇవ్వడానికి ఆరు వారాల గడువు కావాలని కోర్టును ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌‌ కుమార్‌‌ కోరారు. దాంతో కోర్టు నవంబర్‌‌ 1కి విచారణను వాయిదా వేసింది.