- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: ఆకస్మిక వరదలు, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 22న కోదాడ పట్టణంలోని షిరిడి సాయి నగర్‌లో మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మాక్ డ్రిల్ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ కే.నరసింహతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ.. పోలీసు శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారి 65తో పాటు సూర్యాపేట పరిధిలోని పలు బ్లాక్ స్పాట్స్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్చరిక బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు, వేగ నియంత్రణ, ఇంజనీరింగ్ లోపాల సవరణతో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
