హరితహారానికి రూ.50 కోట్లు విడుదల

హరితహారానికి రూ.50 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి రూ.50 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. హరితహారంలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల బకాయిలు ఉన్నందున.. విడుదల చేయాలని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.