అటవీ సిబ్బందిని నిర్బంధించిన పోడు రైతులు

అటవీ సిబ్బందిని నిర్బంధించిన పోడు రైతులు

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం  రౌట సంకేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ అధికారులను పోడు భూముల రైతులు అడ్డుకున్నారు. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు  50 మంది ఫారెస్ట్ సిబ్బందిని ఈసందర్భంగా గ్రామస్తులు నిర్బంధించారు. పోడు భూముల సమస్య పరిష్కరించే దాకా వారిని విడిచి పెట్టమని తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న  పోడు భూములను వదులుకునే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. తమ భూములు తమకు వదిలివేయాలని కోరారు.