50 శాతం మంది మాస్కులే పెట్టుకోవట్లేదు

50 శాతం మంది మాస్కులే పెట్టుకోవట్లేదు

కరోనాను అరికట్టేందుకు మాస్కులు ధరించడం..భౌతిక దూరం పాటించడం ముఖ్యమని చెబుతున్నా..కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్కులు లేకుండా తిరుగుతూ ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం మంది మాస్కులు ధరించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ అన్నారు. 64 శాతం మంది పెట్టుకుంటున్నప్పటికీ...ముక్కును కవర్‌ చేయడం లేదని తెలిపారు. ఇవన్నీ ఓ పరిశోధనలో తేలినట్లు చెప్పారు. దేశంలో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాలు ఎనిమిది ఉన్నాయని, 50 వేల నుండి లక్ష మధ్య యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాలు 9 ఉన్నాయన్నారు. 50 వేలకు లోపు యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాలు 19 ఉ న్నాయని చెప్పారు.