భూ సేకరణ కేసులో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

భూ సేకరణ కేసులో  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ‘‘మీ వాదన వినాలంటే ముందు 50 శాతం భూ పరిహార సొమ్మును డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాలి” అని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి హైకోర్టు తేల్చి చెప్పింది. రోడ్డు విస్తరణ కోసం తీసుకున్న భూమి ప్రభుత్వానిదేనని చెబుతున్నప్పుడు పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు భూసేకరణ నోటీసు ఎందుకు ఇచ్చారని నిలదీసింది. పరిహార చెల్లింపులకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అధికారులు అవార్డు కూడా జారీ చేశారని, ఇప్పుడు అది ప్రభుత్వ భూమేనని ఎలా చెబుతారని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ వాదించడం సబబు కాదని చెప్పింది. సొంత ఖర్చులతో అధికారులు అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ను నియమించుకోవాలని సూచించింది. స్థల యజమాని తన భూమి హక్కుల పత్రాలను హైకోర్టుకు సమర్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ చేసిన అభ్యర్థ
నను తోసిపుచ్చింది.

కోర్టు ధిక్కరణ కేసులో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ వాదనలు వినాలంటే ముందుగా పరిహారంలో సగం సొమ్మును హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ చేపడతామని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.నంద డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌‌‌‌‌‌‌‌లోని నాగాహిల్స్‌‌‌‌‌‌‌‌ వద్ద రోడ్డు విస్తరణ కోసం మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఖాజం అలీ స్థలాన్ని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సేకరించింది. పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ టి.వెంకన్న స్వయంగా విచారణకు హాజరుకావాలన్న గత ఉత్తర్వుల మేరకు ఆయన కొవిడ్‌‌‌‌‌‌‌‌ కారణంగా హాజరుకాలేకపోయారని, భూసేకరణ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారని ప్రభుత్వ అడ్వొకేట్​రాధీవ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. అధికారులను వెనకేసుకురావద్దని, కోర్టు ధిక్కరణ కేసుల్లో అధికారులు సొంత ఖర్చులతో అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ను పెట్టుకోవాలని, ప్రభుత్వ అడ్వొకేట్లు వాదించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.