12 రాష్ట్రాల్లో 50 సోలార్ పార్క్‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం

12 రాష్ట్రాల్లో 50 సోలార్ పార్క్‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ 30 వరకు 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటుకు వెల్లడించింది.  ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు,  అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని కొత్త,  పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌‌కె సింగ్ రాజ్యసభకు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ  ఈ పథకం కింద, నవంబర్ 30 నాటికి భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల మొత్తం సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసిందని సింగ్ చెప్పారు. 

గుజరాత్‌‌లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,76) ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తరప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్లు ఉన్నాయి.  జార్ఖండ్‌‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌‌గఢ్‌‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరు అయ్యాయి.