ఏజెన్సీలో ఉప్పొంగిన గోదావరి

ఏజెన్సీలో ఉప్పొంగిన గోదావరి

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500కు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ఉప్పొంగడంతో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్​లోని మన్యంలోనే 62 గ్రామాలకు వేరే ఊర్లతో సంబంధాలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 50, ఆసిఫాబాద్​ జిల్లాలో 50, ఆదిలాబాద్​ జిల్లాలో 45, భూపాలపల్లి జిల్లాలో 45 , ములుగు జిల్లాలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇందులో గోదావరి ముంపు గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి ఇబ్బందులు పడ్తున్నారు. రోడ్లు దెబ్బతినడం, వాగులు ఉప్పొంగుతుండడంతో అంబులెన్స్​లు కూడా వెళ్లక రోగులు, గర్భిణులు నరకం చూస్తున్నారు. సరైన తాగునీరులేకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో వందలాది గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.