500 వైన్ షాపులు ​ మూసివేత

 500 వైన్ షాపులు ​ మూసివేత

చెన్నై: తమిళనాడులో గురువారం నుంచి 500 వైన్​షాపులు మూతపడనున్నాయి. చెన్నై సహా పలు సిటీలు, టౌన్​లలో బడి, గుడి, కాలేజీలకు దగ్గర్లో ఉన్న లిక్కర్​ షాపులను దశలవారీగా మూసివేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్​లో ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) బుధవారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 నాటికి మొత్తం 5,329 రిటైల్ లిక్కర్​షాపులు ఉండగా.. అందులో 500 దుకాణాలను మూసివేస్తామని ఏప్రిల్ 12న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది.

ఏప్రిల్ 20న సర్కారు జీవో జారీ చేసింది. ఆ జీవో  ఆధారంగా గుర్తించిన 500 లిక్కర్​ రిటైల్ అవుట్‌‌‌‌లెట్లు గురువారం నుంచి పనిచేయవని టాస్మాక్​ ప్రకటించింది. ప్రతిపక్ష పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) దీనిని స్వాగతించింది. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం స్టాలిన్​హామీ ఇచ్చారని,  ఆ ప్రయాణానికి ఇది ప్రారంభం కావాలని పీఎంకే అధ్యక్షుడు, రాజ్యసభ 
ఎంపీ అన్బుమణి రామదాస్ ట్వీట్‌‌‌‌ చేశారు.