జైలులో మంటలు.. 51 మంది ఖైదీల మృతి

జైలులో మంటలు.. 51 మంది ఖైదీల మృతి

కొలంబియాలోని తొలువా జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. ఖైదీలు పరస్పర దాడులకు పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో కొందరు ఖైదీలు జైలులోని పరుపులకు నిప్పంటించారు. ఆ మంటలు జైలులోని భవనాలన్నింటికి వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఖైదీలు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 51 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పే సరికి ఆలస్యమైంది. అప్పటికే వీరంతా చనిపోయినట్లు గుర్తించారు. మరో 24 మంది ఖైదీలకు గాయాలయ్యాయి.