- మల్కాజిగిరి కమిషరేట్ వెబ్సైట్లో చెక్ చేస్కోవాలని సూచన
మల్కాజిగిరి, వెలుగు : రోడ్ల పక్కన నెలల తరబడి పడి ఉన్న వాహనాలపై మల్కాజిగిరి పోలీసులు చర్యలకు దిగారు. పలు పీఎస్‌ల పరిధిలో యజమానులు వదిలేసిన 510 టూ వీలర్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. వాహనాల పూర్తి వివరాలను కమిషనరేట్ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు.
యజమానులతో పాటు హైపోతికేషన్ హక్కులున్నవారు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లిస్ట్పరిశీలించి నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 6 నెలల్లోగా సంబంధిత పత్రాలతో కార్హెడ్క్వార్టర్స్లోని డీసీపీ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే నిబంధనల ప్రకారం వేలం వేస్తామన్నారు.
