గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు
  • నామినేషన్ విత్ డ్రా చేసుకున్న 11 మంది 

హైదరాబాద్, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం.. 11 మంది తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. 12 జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలో.. 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్​ రెడ్డి బరిలో ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు సైతం పోటీ  చేస్తున్నారు. ఈ సీటు నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఈ బైపోల్ జరుగుతోంది.