
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43శాతం, అత్యల్పంగా విశాఖపట్నంలో 47.66శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరిల 37.69%, భువనగిరిలో 62.05శాతం, మహబూబ్ బాద్ లో 61.04 శాతం పోలింగ్ నమోదైంది.