ఏడేండ్లలో 5,304  మంది..రైతుల ఆత్మహత్య

ఏడేండ్లలో 5,304  మంది..రైతుల ఆత్మహత్య
  •     రాష్ట్ర పోలీసు శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులో వెల్లడి
  •     2022లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ
  •     2015 నుంచి 2022 వరకు 5,304 రైతుల బలవన్మరణాలు
  •     2022లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన రాష్ట్రం
  •     తన పాలనలో ఆత్మహత్యలే లేవంటున్న కేసీఆర్
  •     అదే పాట పాడుతున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పచ్చి అబద్ధాలు ఆడుతోంది. తమ పాలనలో అసలు రైతు ఆత్మహత్యలే జరగలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే మళ్లీ రైతు బలవన్మరణాలు మొదలయ్యాయని బుకాయిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మొదలుకుని ముఖ్య నేతలంతా ఇదే మాట పదేపదే వల్లెవేస్తున్నారు.

సోమవారం రైతులను పరామర్శించడానికి జిల్లాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలవుతాయని కలలో కూడా ఊహించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేశామని పలుమార్లు ఆయన వ్యాఖ్యానించారు.

కానీ, ఆయన మాటలకు రాష్ట్ర పోలీసు శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ) చెబుతున్న లెక్కలకు అసలు పొంతన కుదరడం లేదు. ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ లెక్కల ప్రకారం 2015 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 5,304 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కూలీల మరణాలు దాదాపు ఇందుకు రెట్టింపే ఉన్నాయి. 2022లో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి సంబంధించిన లెక్కలను ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ ఇంకా విడుదలే చేయలేదు. 

2015 నుంచి 2020 వరకు 4,774 మంది రైతులు సూసైడ్ :  రాష్ట్ర పోలీసు శాఖ

రైతుల ఆత్మహత్యల సంఖ్యను తక్కువగా చూపించేందుకు ప్రభుత్వాలు ఆత్మహత్యలను రికార్డు చేయడం లేదని రైతు సంఘాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలకు, వ్యవసాయ సంబంధ కారణాలను కాకుండా ఇతర కారణాలను రికార్డు చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదికకు చెందిన కొండల్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద 2022 జులైలో రాష్ట్ర పోలీసుల నుంచి రైతు ఆత్మహత్యల సమాచారాన్ని కోరారు. పోలీసు శాఖ తరపున అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆయనకు 2014 నుంచి 2020 వరకు జరిగిన ఆత్మహత్యల వివరాలు ఇచ్చింది. 2014లో సగం కాంగ్రెస్, సగం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలన ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఏడాదిని వదిలేస్తే 2015 నుంచి 2020 వరకు 4,774 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా రాష్ట్ర పోలీస్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన డేటా లేదని కొండల్‌‌‌‌రెడ్డికి ఇచ్చిన సమాధానంలో పోలీసులు పేర్కొన్నారు.

ఆ లెక్కలు ఇచ్చింది రాష్ట్ర సర్కారే

వాస్తవానికి ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లెక్కలనే పొందుపరుస్తారు. ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ లెక్కల ప్రకారం 2015 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 5,304 మంది రైతులు సూసైడ్​ చేసుకున్నారు. ఈ లెక్కన ఆత్మహత్యలు జరిగినట్టు నాటి కేసీఆర్ సర్కార్ ఒప్పుకు న్నట్టే. కానీ, ఇప్పుడు అదే కేసీఆర్‌‌‌‌‌‌‌‌, ఆయ న మంత్రివర్గంలో పనిచేసిన నాయకు లు అసలు తమ హయాంలో రైతు ఆత్మహత్యలే జరగలేదని ఓసారి, రైతు ఆత్మహత్యలను జీరోకి తీసుకొచ్చామని మరోసారి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చి రాగానే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

కేసీఆర్ మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు 

తొమ్మిదేండ్ల బీఆర్ఎస్​  పాలనలో వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ, రాష్ట్ర పోలీస్ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నా.. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పే మాటలను నమ్మడానికి ఇంకా ప్రజలు సిద్ధంగా లేరు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్టు ఆత్మహత్యలే లేకపోతే, ఆర్టీఐ దరఖాస్తుదారుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ లెక్కలను ఎందుకు ఖండించలేదో సమాధానం చెప్పాలి. 

ఇందిరా శోభన్, కాంగ్రెస్ లీడర్