శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒకే రోజు 536 విమానాలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒకే రోజు 536 విమానాలు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్టు రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. విమానాశ్రయం నుంచి గత నెల 30న అత్యధికంగా 536 విమానాలు రాకపోకలు కొనసాగినట్లు ఎంజీఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. అయితే ఒక్క రోజులోనే ఇన్ని విమానాలు రాకపోకలు కొనసాగించడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ నగరాలకు కొత్త విమానాలు సైతం ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఎంజీఆర్‌ గ్రూప్‌ పేర్కొంది. 

2024 జనవరిలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు సమాచారం. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 14% వృద్ధి నమోదైనట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఇప్పటి వరకు అంటే 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 21% అధికంగా ఉంది.