సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకున్న సైన్స్‌ ఫెయిర్

సూర్యాపేట జిల్లాలో  ఆకట్టుకున్న సైన్స్‌ ఫెయిర్

హుజూర్ నగర్,వెలుగు: సూర్యాపేట జిల్లా స్థాయి 53వ సైన్స్ ఫెయిర్ ను హుజూర్ నగర్ వీవీఎం స్కూల్‌లో మంగళవారం డీ ఈఓ అశోక్, ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ మంగళవారం ప్రారంభించారు. సైన్స్ ఫెయిర్ లో పర్యావరణ పరిరక్షణ,నూతన శక్తి వనరులు, ఆరోగ్యం, వ్యవసాయం, రోబోటిక్, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. 

ప్రభుత్వ, ప్రైవేటు కస్తూర్బా, గురుకులాల విద్యార్థులు  వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. .ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ..  జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్, జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, పీసీసీ  మెంబర్ దొంగరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి ఎంఈఓలు,హెచ్ఎంలు,టీచర్స్ పాల్గొన్నారు.