నుమాయిష్లో మహిళలను వేధించిన 55 మంది పోకిరిలకు జైలు శిక్ష

నుమాయిష్లో మహిళలను వేధించిన  55 మంది పోకిరిలకు జైలు శిక్ష

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ లో 49 రోజుల పాటు కొనసాగిన నుమాయిష్‌ ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారంతో ముగిసింది.  ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్‌ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది.  సుమారుగా 22 లక్షల మంది వచ్చినట్లుగా అంచనా.  చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు. నుమాయిష్ లో మహిళలను వేధించిన 123 మంది పోకిరిలను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి.  వారిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా..  వారిలో 55 మంది పోకిరిలకు రెండు నుంచి నాలుగు రోజుల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు.  మరో  51 మందికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు.  

స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు 1938 లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.  ఉస్మానియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారి ఆలోచనల మేరకు  అప్పటి హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటిసారిగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.  ఇందులో వచ్చిన రెస్పాన్స్ ను చూసి ప్రతి ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఎగ్జిబిషన్ లో వచ్చే ఆదాయాన్ని విద్యాభివృద్దికి వినియోగించాలని నిర్ణయించారు.  అప్పట్లో 50 స్టాల్స్ తో ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ నేడు దేశంలోరి అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శరలలో ఒకటిగా నిలిచింది.