పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. హైకోర్టు తీర్పు తర్వాత MPTC, ZPTC ఎలక్షన్స్: కేబినెట్ నిర్ణయాలు ఇవే

పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. హైకోర్టు తీర్పు తర్వాత MPTC,  ZPTC ఎలక్షన్స్: కేబినెట్ నిర్ణయాలు ఇవే

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 17) సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, గిగ్ వర్కర్ల బిల్లుతో పాటు పలు అంశాలపై మంత్రి మండలి చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే:

  • డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు
  • ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
  • ముందు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహణ
  • బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
  • పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ గేయం చేర్చాలని నిర్ణయం
  • అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం
  • గిగ్ వర్కర్స్ బిల్లుకు ఆమోదం
  • ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్‎కు దామోదర్ రెడ్డి పేరు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్
  • హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ పాలసీకి ఆమోదం
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం
  • సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం
  • మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతో కూడిన ప్రభుత్వ బృందాన్ని సౌదీ పంపాలని నిర్ణయం