55 ఏండ్ల వయసులో పన్నెండో క్లాస్ పాస్

55 ఏండ్ల వయసులో పన్నెండో క్లాస్ పాస్

బరేలీ: ఉత్తరప్రదేశ్​కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్​మిశ్రా 55 ఏండ్ల వయసులో 12వ తరగతి పాస్​అయ్యాడు. యూపీ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించిన బోర్డ్​ఎగ్జామ్​లో ఆయన 500 మార్కులకు 263 సాధించాడు. హిందీలో 57, సివిక్స్‌‌లో 47, ఎడ్యుకేషన్‌‌లో 42, డ్రాయింగ్ డిజైన్‌‌లో 36, సోషియాలజీలో 81 మార్కులు వచ్చా యి. మిశ్రా.. 2017 నుంచి 2022 వరకు బరేలీ జిల్లాలోని బిత్రీ-చైన్‌‌పూర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

"రెండేండ్ల క్రితం నేను 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఇప్పుడు 12వ తరగతి పరీక్షలో కూడా పాస్ ​అయ్యాను. ఇక ఎల్‌‌ఎల్‌‌బీని అభ్యసించాలనుకుంటున్నాను. తద్వారా పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలనుకుంటున్నాను" అని మిశ్రా చెప్పారు. మంచి లాయర్ల సేవలు పొందలేక ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు న్యాయం జరగడం లేదని, అలాంటి వారికి అడ్వొకేట్​గా ఉంటానని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.