- 2041 మంది వార్డు మెంబర్లు
- ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన నామినేషన్ల విత్ డ్రా
- ప్రచారానికి పదును పట్టిన అభ్యర్థులు
ఆదిలాబాద్, మంచిర్యాల, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారం నామినేషన్లను స్రూటినీ, విత్ డ్రా ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రామ పంచాయితీ ఎన్నికల స్క్రూటినీ, విత్ డ్రా ప్రక్రియపై కలెక్టర్ రాజర్షి షా గూగుల్ మీట్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు.
మొత్తం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 166 పంచాయతీలకు, 1390 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 98 మంది సర్పంచ్ అభ్యర్థులు, 88 మంది వార్డు సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో 550 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2041 మంది వార్డు మెంబర్లు బరిలో నిలిచారు.
నామినేషన్లు ఉప సంహరణ ముగియడంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. యువతకు దావత్లు, మహిళలకు పలు హామీలిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలో ఉన్న18 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు మొత్తం 78 నామినేషన్లు వచ్చాయి. కాగా బుధవారం 32 మంది విత్ డ్రా అయ్యారు. దీంతో మొత్తం 46 మంది పోటీలో నిలిచారు.160 వార్డు స్థానాలకు 372 మంది నామినేషన్ వేశారు. 32 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 16 మంది విత్ డ్రా అయ్యారు.
దీంతో మిగిలిన 128 స్థానాల్లో 324 మంది బరిలో ఉన్నారు. జన్నారం మండలంలో 29 సర్పంచ్ స్థానాలుండగా 170 నామినేషన్లు వచ్చాయి. ఇందులో రెండు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 45 మంది విత్ డ్రా చేసుకోగా 123 మంది పోటీలో నిలిచారు. హాజీపూర్ మండలంలోని 51 స్థానాలకు గానూ 12 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవయ్యాయి. 39 మంది పోటీలో ఉన్నారు. 106 వార్డులకు గానూ 22 ఏకగ్రీవమయ్యాయి. 84 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో నిలిచారు.
