
మహారాజ్‌గంజ్ : ‘నా ఛాతీ 56 అంగుళాలు’ అని తన ధైర్యం గురించి చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన మనసు ఎక్కడుందో చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. “ మన ప్రధాని దృష్టిలో నేషనలిజమ్ అంటే కేవలం పాకిస్థాన్‌పై దాడులు చేయడమే. రైతులు, నిరుద్యోగుల సమస్యలు తీర్చడం నేషనలిజమ్ కాదు. ఆయన రైతు వ్యతిరేకి” అని విమర్శించారు. ఐదేండ్లలో మోడీ ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగొచ్చారని, సొంత దేశంలోని రైతుల్ని పట్టించుకునేందుకు తీరిక దొరకలేదని ఎగతాళి చేశారు. ఏడాదికి ఆరువేలు ఇచ్చి రైతుల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పబ్లిక్ సెక్టార్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.