జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది..ప్రధాన పోటీ వీళ్ల మధ్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  బరిలో 58 మంది..ప్రధాన పోటీ వీళ్ల మధ్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీలో  ఉన్నారు. స్క్రూట్నీ అనంతరం ప్రధాన పార్టీలతో సహా  81 మంది నామినేషన్లు ఉండగా.. 23 మంది ఇవాళ విత్ డ్రా చేసుకున్నారు. ఇంకా బరిలో 58 మంది ఉన్నారు. వీరికి కాసేపట్లో   అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించనున్నారు ఎన్నికల అధికారులు. 

ప్రధాన  పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ఉండనుంది.  సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త రకం ఓటర్​ప్లిప్ లు ఇవ్వనున్నారు  జిల్లా ఎన్నికల అధికారులు.  ఓటర్‌‌‌‌ స్లిప్‌‌‌‌లపై ఓటర్ల సీరియల్‌‌‌‌ నంబర్‌‌‌‌, పార్ట్‌‌‌‌ నంబర్‌‌‌‌ ను పెద్ద అక్షరాలతో చదవడానికి వీలుగా ముంద్రించనున్నారు. పోలింగ్‌‌‌‌ కేంద్రాల్లో గందరగోళం లేకుండా ఓటర్లు తమ వివరాలను ఈజీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తోంది.