మొదటి రోజే 5.8 లక్షల చలాన్లు క్లియర్ .. రూ.6 కోట్లకు పైగా ఇన్ కం

మొదటి రోజే 5.8 లక్షల చలాన్లు క్లియర్ ..  రూ.6 కోట్లకు పైగా ఇన్ కం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో   వెహికల్స్  చలాన్ల క్లియరెన్స్ ఆఫర్​కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆఫర్ మొదలైన మొదటి రోజే దాదాపు 5.8 లక్షలకు పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇందుకు సంబంధించి  రూ.6 కోట్లకు పైగా ఫైన్ అమౌంట్ వసూలైంది. డిస్కౌంట్ ఆఫర్ జనవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ట్రాఫిక్ చలాన్స్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిస్కౌంట్ ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో  ఈ– చలాన్స్ పోర్టల్​ను పోలీసులు అప్​గ్రేడ్ చేశారు. బైక్స్, ఆటోలపై ఉన్న చలాన్లకు 80 శాతం, టీఎస్ఆర్టీసీ బస్ చలాన్లలో 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికల్స్​పెండింగ్ చలాన్లపై 60 శాతం డిస్కౌంట్ అప్​డేట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆఫర్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు విధించిన చలాన్స్ కు ఆఫర్ వర్తించనుంది. 

అయితే,  పేమెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో సర్వర్ మొరాయిస్తున్నది. దాంతో అధికారులు ఇంటర్నెట్ స్పీడ్ 500 ఎంబీపీఎస్ ఉన్న బ్రాండ్ విడ్త్ తో 2.5 జీబీకి అప్ గ్రేడ్ చేశారు. ఆన్ లైన్ పేమెంట్స్ లేదా  మీ సేవా సెంటర్లు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న కౌంటర్స్ లో  పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.