ఆటో కాంపోనెంట్ పరిశ్రమకు... ఆకాశమే హద్దు..ఐదేళ్లలో రూ.58 వేల కోట్ల పెట్టుబడులు

ఆటో కాంపోనెంట్ పరిశ్రమకు... ఆకాశమే హద్దు..ఐదేళ్లలో రూ.58 వేల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ : ఆటో కాంపోనెంట్లకు (విడిభాగాలు) దేశ, విదేశీ మార్కెట్లలో డిమాండ్​ శరవేగంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. టెక్నాలజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో 6.5 నుంచి 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.58 వేల కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) రూ. 2.98 లక్షల కోట్లతో 12.6 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని ఆటో కాంపొనెంట్స్​ పరిశ్రమ సాధించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలోనూ రెండంకెల అమ్మకాల వృద్ధి కొనసాగుతుందని అంచనా. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా డిమాండ్​ బాగుంటుందని ఈ రంగంలోని ఎక్స్​పర్టులు అంటున్నారు. దేశీయ,  అంతర్జాతీయ వినియోగదారుల డిమాండ్​ తీర్చేందుకు,  టెక్నాలజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్,  లోకలైజేషన్ ​ కోసం కాంపోనెంట్స్ పరిశ్రమ పెట్టుబడులు పెడుతూనే ఉందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా ఇక్కడ విలేకరులతో అన్నారు. 

పరిశ్రమ గత ఐదేళ్లలో ఖర్చు చేసిన 3.5-4 బిలియన్ డాలర్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో 6.5-7 బిలియన్ డాలర్ల క్యాపెక్స్ పెట్టుబడి పెట్టాలని చూస్తోందని ఆమె తెలిపారు.  పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాహన పరిశ్రమలోని చాలా విభాగాలలో గణనీయమైన అమ్మకాలు బాగా జరిగాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మంచి పనితీరును కనబరుస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. 

తొలగిన కరోనా కష్టాలు

అన్ని విభాగాలలో వాహన అమ్మకాలు కరోనాకు ముందున్న స్థాయికి చేరుకున్నాయి. సెమీకండక్టర్ల లభ్యత మెరుగుపడింది. సప్లై చెయిన్​ సమస్యలు తగ్గాయి. కంటెయినర్లు భారీగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆటో విడిభాగాల రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో దేశీయ,  అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో బలమైన వృద్ధిని సాధించింది.  ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా మాట్లాడుతూ, వాహన విక్రయాలు,  ఎగుమతులు స్థిరమైన ఆశించిన స్థాయిలో ఉండటంతో, ఆటో కాంపోనెంట్ పరిశ్రమ 12.6 శాతం వృద్ధిని ప్రదర్శించిందని అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో రూ. 2.98 లక్షల కోట్ల (36.1 బిలియన్ డాలర్లు) టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సాధించిందని చెప్పారు.  పరిశ్రమలోని అన్ని విభాగాలకు, ఓఈఎంలకు ఆటో కాంపోనెంట్ల సరఫరాతోపాటు ఎగుమతులు పెరిగాయని ఆయన తెలిపారు.  ఆటో కాంపోనెంట్ ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు (రూ. 85.87 లక్షల కోట్లు), దిగుమతులు 3.6 శాతం వృద్ధితో 10.6 బిలియన్ డాలర్లకు (రూ. 87.42 లక్షల కోట్లు) పెరిగాయి.

చైనా నుంచి ఎక్కువ దిగుమతులు

దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉందని, చైనా అతిపెద్ద దిగుమతి దేశంగా ఎదిగిందని చెప్పారు. యూరప్,  ఉత్తర అమెరికా వరుసగా 27 శాతం  9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మెహతా పేర్కొన్నారు.  దిగుమతులను తగ్గించడానికి పరిశ్రమ తన వంతు ప్రయత్నాలు చేస్తోందని,  ప్రభుత్వ మద్దతుతో స్థానికీకరణపై దృష్టి సారించిందని విన్నీ వివరించారు. ఎగుమతుల విషయానికొస్తే, ఈ ఏడాది ఏప్రిల్–-సెప్టెంబర్ కాలంలో ఉత్తర అమెరికా,  యూరప్ 33 శాతం వాటాతో అతిపెద్ద మార్కెట్లుగా ఉన్నాయి. 

దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓఈఎంలకు కాంపోనెంట్ అమ్మకాలు ఏడాదికి 13.9 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.  ఆఫ్టర్​మార్కెట్ కూడా ఏడాదికి 7.5 శాతం వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్​ సెగ్మెంట్ వృద్ధి చెందుతూనే ఉందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈవీ పరిశ్రమకు విడిభాగాల విక్రయాల ద్వారా ఆదాయం పెరిగిందని మెహతా చెప్పారు. ఏసీఎంఏ 875 మంది ఆటో కాంపోనెంట్​  తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తోంది.