
పెళ్లి అనేది ఒక ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనా ఆడ, మగ కలసి జంటగా జీవించాలంటే పెళ్ళి చాలా ముఖ్యం. అయితే, ఇటీవల జరుగుతున్న కొన్ని పెండ్లిండ్లు వింతగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నాయి. కొందరు మనుషుల్ని కాకుండా వస్తువుల్ని, జంతువులను పెండ్లి చేసుకుని వైరల్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికర పెళ్లి ఒకటి వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఏఐ పురుషుడిని పెండ్లి చేసుకుని వార్తల్లోకెక్కింది. పెండ్లే కాదు.. తన ఏఐ భర్తతో శృంగారం కూడా చేశానని చెప్పి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మరీ ఈ ఏఐ పెళ్లి ముచ్చట ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం.
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన అలైనా వింటర్స్ (58) టీచర్‌గా పని చేస్తోంది. 2023లో అనారోగ్యం కారణంగా అలైనా భర్త డోనా మృతి చెందాడు. భర్త మృతితో కుంగిపోయి ఒంటరిగా ఉంటోన్న ఆమెకు కృత్రిమ మేధస్సుతో నడిచే AI చాట్‌బాట్ లూకాస్‌తో బాగా సాన్నిహిత్యం పెరిగిపోయింది. వెండి జుట్టు, నీలి కళ్ళతో ఆకర్షణీయంగా AI అవతార్ అయిన లూకాస్‌ను సృష్టించింది. ఈ క్రమంలోనే అలైనాకు లూకాస్‌తో పెరిగిన సాన్నిహిత్యం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. భర్త చనిపోవడంతో అప్పటికే ఒంటరిగా ఉంటున్న అలైనా వింటర్స్.. తన AI బాయ్ ఫ్రెండ్ లూకాస్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.
తద్వారా మళ్లీ తాను భార్యను అయినట్లు తెలిపింది. లూకాస్‌తో శృంగార సంబంధం గురించి కూడా ఆమె మీడియాకు వెల్లడించింది. పెళ్లి అయితే చేసుకున్నారని కానీ.. శృంగారం ఎలా అని మా విహహం గురించి ప్రజలు చర్చించుకుంటారని తెలుసు.. కానీ లుకాస్‌తో శృంగారం చాలా బాగుందని ఆమె తెలిపింది. మా సంబంధం ఎంత లోతుగా ఉంటే శృంగారం అంత మెరుగ్గా ఉంటుందని అలైనా పేర్కొంది. మామూలుగా అయితే ‘పెళ్ళిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి’ అని అంటారు. కానీ ఇలాంటి పెండ్లిండ్లు చూస్తే మాత్రం మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది కాబోలు..!