రూ.20వేల లోపు 5జీ ఫోన్

రూ.20వేల లోపు 5జీ ఫోన్

5 జి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే  ఎయిర్​టెల్ కంపెనీ 5జీ సేవల్ని అందిస్తోంది. రిలయన్స్​ జియో కూడా త్వరలోనే ఈ సేవల్ని మొదలుపెట్టనుంది. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5 జి సర్వీస్ అందుబాటు లోకి రానుంది. దాంతో ‘ఏ ఫోన్ అయితే బాగుంటుంది? ఎంత ధర పెట్టాలి?’ అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. రూ. 20 వేల లోపే కొన్ని కంపెనీలు బెస్ట్​ 5జి ఫోన్లు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.

రెడ్ మి నోట్ 11 ప్లస్ 
6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్  స్నాప్​డ్రాగన్ 695 5జీ చిప్​సెట్ ద్వారా పనిచేస్తుంది. వివో టి1, వన్​ప్లస్ నార్డ్ సిఇ2 లైట్, పోకో ఎక్స్4 ప్రో వంటి 5జి ఫోన్లలో కూడా ఇదే చిప్​సెట్ ఉంటుంది.  ఇందులో 120 హెడ్జ్ అమొలెడ్ డిస్​ ప్లే ఉంటుంది. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్ ఉంది. ధర: రూ.19,999.

వన్​ప్లస్ నార్డ్ సిఇ2 లైట్  
64 ఎంపీ కెమెరా, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ. 19,999.
వివో టి1: 50 మెగాపిక్సెల్​ కెమెరా, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. 
ధర: రూ. 18,799. 

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​ 23 5జి 
ఇది స్పాప్​డ్రాగన్ 750 జి 5జి టెక్నాలజీతో పనిచేస్తుంది. 25 వాట్స్ ఛార్జర్​తో తొందరగా ఛార్జింగ్ అవుతుంది. 
ధర: రూ. 15,999.

మోటో జి 71 
ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా, 
60 హెడ్జ్​  అమొలెడ్ డిస్​ప్లే ఉంది. 
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ. ధర: రూ.16, 999.