ఈ ఏడాది దేశంలో 5జీ సేవలు షురూ

ఈ ఏడాది దేశంలో 5జీ సేవలు షురూ

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022–23లో ప్రైవటే సంస్థల ద్వారా 5జీ సాంకేతికతను దేశంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.  2022–23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను చేరవేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పాస్‌పోర్టు సేవలను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. 

రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం

డీఆర్‌డీవో, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నామన్నారు.