భారత్‌లో 5జీ టెక్నాలజీ ట్రయల్స్

భారత్‌లో 5జీ టెక్నాలజీ ట్రయల్స్

5G టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్(TSP) కు టెలికమ్యూనికేషన్ విభాగం(DOT) మంగళవారం అనుమతించింది. సర్వీసు ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో 5జీ ట్రయల్స్‌ నిర్వహిస్తారని తెలిపింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ లలో భారతీ ఎయిర్‌ టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, MTNL ఉన్నాయి. ఈ TSPలు ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అలాగే, రిలయన్స్ జియోఇన్‌ఫోకామ్ లిమిటెడ్ కూడా సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. 

5జీ టెక్నాలజీతో టెలిమెడిసిన్, టెలీడ్యూకేషన్, ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్స్ వంటి రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ టెక్నాలజీ డేటా డౌన్‌లోడ్ వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్ ఫోన్‌కే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విప్లవాన్ని సృష్టించనున్నట్లు ఎక్స్ ఫర్ట్స్ తెలుపుతున్నారు.