ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: ఖైరతాబాద్లో ప్రతిష్టించిన  శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఐదవ రోజు పూజలు కొనసాగుతున్నాయి. ఉదయం  6 గంటలకు గణపతి హోమం, అర్చన, హారతి  అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఖైరతాబాద్ చరిత్రలోనే మొదటిసారి మట్టి విగ్రహం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆదివారం కావడం భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

క్యూలైన్ లో గంటల తరబడి ఎదురుచూపులు

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా వేలాదిగా తరలివస్తుండడంతో క్యూలైన్ కిటకిటలాడుతోంది. క్యూ లైన్ లో గంటలతరబడి ఎదురు చూస్తున్నారు. వీఐపీల సందర్శన లేని సమయంలో వీఐపీ క్యూలైన్లో సాధారణ భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తరచూ కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు.