తాజ్ హోటల్ ఆరుగురు సిబ్బందికి కరోనా

తాజ్ హోటల్ ఆరుగురు సిబ్బందికి కరోనా

ముంబై: మహారాష్ట్ర కేపిటల్ సిటీ ముంబైలోని తాజ్ మహల్ హోటల్, తాజ్​మహల్ టవర్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. తమ ఉద్యోగులలో కొద్దిమందికి కరోనా వచ్చిందని హోటల్ నిర్వాహకులైన ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్​సీ) వెల్లడించింది. కానీ ఎంతమందికి వైరస్ సోకిందనే విషయం మాత్రం చెప్పలేదు. వారికి పాజిటివ్ గా తేలినప్పటికీ ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని స్పష్టం చేసింది. పాజిటివ్ కన్ఫామ్ అయిన వారితో పాటు పనిచేస్తున్న ఇతర సిబ్బందిని క్వారంటైన్ కి తరలించామని పేర్కొంది. ‘‘ఇక్కడ ట్రీట్​మెంట్ పొందుతున్న ఆరుగురు తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారి కండిషన్ స్థిరంగా ఉంది. వేగంగా కోలుకుంటున్నారు. ఇందులో ముగ్గురు పోయిన వారంలోనే ఆస్పత్రికి రాగా ఇద్దరు శనివారం అడ్మిట్ అయ్యారు”అని బొంబాయి ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ బన్సాలీ మీడియాతో చెప్పారు.

లాక్​డౌన్ ప్రారంభం నుంచే తమ హోటల్స్ అన్నీ బంద్ చేశామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. అయితే, హోటల్స్ లోని సామాగ్రి పాడుకాకుండా ఉండేందుకు కొంతమంది సిబ్బందిని మెయింటేన్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం హోటల్స్ లో గెస్టులెవరూ లేకపోయినా.. తాజ్ హోటల్​లో కిందటివారం తనకు వసతి కల్పించారని, తర్వాత బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ కు మార్చారని ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఓ డాక్టర్ మీడియాతో చెప్పారు.