
ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో రసగుల్లాలు దొరకకపోవడంతో కొందరు గొడవకు దిగారు. దీంతో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శంషాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ శర్మ తెలిపారు.
ఈ పెళ్లి వేడుకలో రసగుల్లాలు త్వరగా అయిపోయాయి. దీనిపై ఓ వ్యక్తి ప్రశ్నించగా... మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమెదు చేశామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన గవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.