తేనెలో డ్రైఫ్రూట్స్ కలిపి తింటే.. 6 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తేనెలో డ్రైఫ్రూట్స్ కలిపి తింటే.. 6 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, క్రొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్ల తో కూడిన పౌష్టికాహారం అవసరం ప్పనిసరి. ఇవి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీ రోల్ పోషిస్తాయి. యాక్టివ్ గా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోవడం చాలా అవసరం.. ఏ ఒక్కటి లోపించినా ఆరోగ్యంలో తేడా వస్తుంది. అయితే ఇవి ఏఏ పదార్థాల్లో ఏవేవి దొరుకుతాయనేది క్వశ్చన్.. అటువంటి వారికోసం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుంది. 

నీటిలో నానబెట్టిన బాదం పప్పులను మన రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.  బాదంపప్పులు మాత్రమే కాదు. వాల్ నట్ లు, ఎండు ద్రాక్ష వంటి ఎండిన పండల్లో ప్రోటీన్లు, ఆరోగ్య కరమైన క్రొవ్వులు, ఖనిజాలు ఉంటాయి.  తేనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. తేనె, డ్రై ఫ్రూట్స్ రెండింటిలో ప్రయోజనకరమైన కొవ్వులు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకమైనవి అంటున్నారు. 

గింజలు, పండ్లు, తేనె కలిపి తింటే నోటికి రుచికరమైన ఆహారంతోపాటు శక్తివంతమైన రోగ నిరోధక శక్తిని పెంచే సాధనంగా కూడా పనిచేస్తుంది. వీటిని తిరుతిండిలా తీసుకోవచ్చు. తేనెతో కలిపి ఎండిన పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలను తెలుసుకుందాం
తేనె, ఎండిన పండ్లతో ప్రయోజనాలు: 
న్యూట్రీషియన్ బూస్ట్ : ఎండిన పండ్లను తేనె కలిపి తీసుకున్నా.. సపరేట్ గా ఎండిన పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. 
తక్షణ శక్తి: తేనె, డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటే తక్షణమే శక్తిని పెంచుతాయి. వీటిలోని సహజ చక్కెరలు శరీరక శ్రమ, బిజీ షెడ్యూల్ సమయాల్లో తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన తిరుతిండిగా ఉపయోగపడుతుంది. 
జీవక్రియ వ్యవ్యస్థ ఆరోగ్యం: ఎండిన పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇది జీవక్రియకు సహాయపడుతుంది. సాధారణంగా ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
యాంటీ ఆక్సిడెంట్ రక్షణ : తేనె,కొన్ని ఎండిన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యం : ఎండుద్రాక్ష,ఆప్రికాట్ వంటి ఎండిన పండ్లను తేనెతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇవి పొటాషియం, ఫైబర్ ,ఫినోలిక్ పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తాయి. 
రోగనిరోధక శక్తి: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎండిన పండ్లను విటమిన్లు, ఖనిజాలతో కలిపితీసుకున్నపుడు అంటువ్యాధుల నుంచి రక్షించేందుకు సహాయ పడతాయి.