టెన్త్ మ్యాథ్స్ లో అదనంగా 6 మార్కులు

టెన్త్ మ్యాథ్స్ లో అదనంగా 6 మార్కులు

ప్రశ్నపత్రంలో తప్పుల నేపథ్యంలో అధికారుల నిర్ణయం

హైదరాబాద్‌, వెలుగు: పదో తరగతి వార్షిక పరీక్షలు రాసిన స్టూడెంట్లకు శుభవార్త. మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పుల ఫలితంగా సదరు ప్రశ్నలను టచ్​ చేసిన విద్యార్థులకు ఆరు మార్కులు అదనంగా కలుపనున్నాయ్. యాడ్ స్కో రు కింద ఈ మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించిం ది. ఈ మేరకు జిల్లా స్పాట్‌ కేంద్రాలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. పేపర్‌–1లో ఐదున్నర మార్కులు, పేపర్‌-2లో అరమార్కు కలుపనున్నా రు. టెన్త్‌ పేపర్‌–1లోని పార్ట్‌- ఏ లోని ఆరో ప్రశ్నకు ఒక మార్కు, 16వ ప్రశ్నకు 4మార్కులు, పార్ట్‌ -బీలోని 7వ ప్రశ్నకు అరమార్కు, పేపర్‌ 2 లో పార్ట్‌- బీలో 4వ ప్రశ్నకు అర మార్కును కలుపనున్నా రు. ప్రశ్నపత్రంలోని తప్పులను గుర్తిం చి, పరీక్షల విభాగం అధికారులకు దృష్టికి తీసుకుపోయామని తెలంగాణ గణిత ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.