డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ తో పాటు 9 మందికి జైలు శిక్ష

డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ తో పాటు 9 మందికి జైలు శిక్ష

పటాన్‌‌చెరు,వెలుగు : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వెహికల్ నడిపి పట్టుబడ్డ 9 మందిని పటాన్ చెరు ట్రాఫిక్ పోలీసులు సోమవారం సంగారెడ్డి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 9 మందిలో నలుగురికి 20 రోజుల జైలు, ఒక్కొక్కరికి రూ.2 వేలు ఫైన్ విధించారు. మరో ముగ్గురికి 10 రోజుల జైలు, ఒక్కొక్కరికి రూ.2 వేలు ఫైన్, ఒకరికి 12 రోజుల జైలు, రూ.2 వేలు ఫైన్, మరో వ్యక్తికి రూ.2 వేలు ఫైన్ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్టు ట్రాఫిక్ సీఐ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి శిక్షపడ్డ వారిలో ఓ కాంట్రాక్ట్ ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నట్టు ఆయన చెప్పారు.