
ప్రపంచం మొత్తం 2023కి వీడ్కోలు పలికిన సందర్భంగా.. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన సంవత్సరాంతపు డేటాను వెల్లడించింది. ఇందులో వెజ్, నాన్ వెజ్ లలో వెరైటీ వంటకాలను కస్టమర్లు అస్వాదించారు. ఈ డేటా ప్రకారం.. వెజ్ కంటే నాన్ వెజ్ వంటకాలనే ఎక్కువ మంది ఆర్డర్ చేశారు. ఏడాది పాటు సాగిన ఈ ఆర్డర్స్ లో వెజ్ ఆర్డర్లు 40% గా ఉంటే.. నాన్ వెజ్ 60%తో ఆధిపత్యం సాధించి గట్టి పోటీని ప్రదర్శించింది.
త్రిసూర్, ఎర్నాకుళం, తిరువనంతపురంలలోని కస్టమర్లు అత్యంత ఎక్కువ వెజ్ ఆర్డర్‌లు చేసినట్టు తాజా డేటా సూచిస్తోంది. ఇక ఎప్పటి లాగే చికెన్ బిర్యానీ తిరుగులేని ఛాంపియన్ గా అవతరించింది. కేరళలో అత్యధికంగా కోరుకునే వంటకంగా దాని స్థానాన్ని నిలబెట్టుకుంది. దీంతో పాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అధిగ మంది ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక శాఖాహారం విషయానికొస్తే.. పనీర్ బటర్ మసాలా వంటి వంటకాలున్నాయి.
2023లో కేరళకు చెందిన స్విగ్గీ వినియోగదారులు అధిక సంఖ్యలో ఆర్డర్స్ చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా నవంబర్ 19తో పాటు డిసెంబర్ 10, 17 తేదీల్లోనూ గణనీయమైన ఆర్డర్ లు వచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే 2023లో తిరువనంతపురంకు చెందిన ఓ యూజర్.. ఏకంగా 1,631ఆర్డర్లతో హాట్ టాపిక్ గా మారాడు. అంటే దాదాపు రోజుకు 4ఆర్డర్స్ అన్నమాట.