
ప్రేమకు కులం, మతం మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది ఓ జంట. ఉత్తర్ప్రదేశ్.. భదోహి జిల్లాలోని బీహరోజ్పుర్కు చెందిన రామ్ యాదవ్(60), అషర్ఫీ దేవి(28) ఇద్దరు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రామ్ యాదవ్ కు కుమారుడు, కోడలు, మనమడు, మనమరాలు ఉండగా, అషర్ఫీ దేవికి భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటున్న రామ్, అషర్ఫీ ఇక దూరంగా ఉండలేక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
దీంతో ఇంట్లో నుంచి పారిపోయారు. అయితే అషర్ఫీ దేవి భర్త కృష్ణ మూరత్ యాదవ్తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వీరి ప్రేమ వ్యవహారం భయటపడింది. వారిని గాలించి పట్టుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవ లేకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. తన భర్త కృష్ణతో వెళ్లేందుకు అషర్ఫీ దేవి అంగీకరించలేదు. తన ప్రియుడు రామ్ యాదవ్నే వివాహం చేసుకుంటానని పోలీసుల ఎదుట చెప్పింది.
అటు రామ్ యాదవ్ కు కూడా అతని కుమారుడు, కోడలు, మనమడు, మనమరాలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను కూడా వినలేదు. అషర్ఫీ దేవినే పెళ్లి చేసుకుంటానని తేగేసి చెప్పాడు. దీంతో చేసేది ఏమీ లేకా ఇరువురి కుటుంబ సభ్యులు వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్లోనే రామ్ యాదవ్, అషర్ఫీ దేవి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.