
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో నమోదైన సైబర్ కేసుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. సిటీ అడిషనల్సీపీ విశ్వప్రసాద్మంగళవారం సంబంధిత వివరాలు వెల్లడించారు. గత ఆగస్టులో పోలీసులకు 338 ఫిర్యాదులు రాగా.. 233 కేసులు నమోదు చేశారు.
ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 13 మందిని, ఇన్వెస్ట్‌మెంట్12 , సోషల్ మీడియా ఫ్రాడ్స్లో 11, ఇన్సూరెన్స్ మోసాలు 8, డిజిటల్ అరెస్ట్ స్కాంలలో ముగ్గురు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 132 కేసుల్లో కేవలం తమిళనాడుకు చెందిన 20 మంది,- కర్ణాటకకు చెందిన 16, -మహారాష్ట్ర 13,- గుజరాత్ 18, ఏపీ ఏడుగురు, ఢిల్లీలో 13, పశ్చిమ బెంగాల్ కు చెందిన 8 మంది ఉన్నారు. మిగతా కేసుల్లో యూపీ,- మధ్యప్రదేశ్, బిహార్, అసోం, ఉత్తరాఖండ్, రాజస్థాన్ కు చెందినవారు ఉన్నారు. అరెస్ట్చేసినవారి వద్ద నుంచి రూ. కోటి రికవరీ చేసి, బాధితులకు రీఫండ్ చేసినట్లు అడిషనల్సీపీ పేర్కొన్నారు.